వైష్ణవి కథ 2

అనగనగా ఒక చిన్న ఊరిలో వైష్ణవి దేవి అనే అమ్మాయి ఉండేది. ఆమెకు చదువులో మంచి ఆసక్తి ఉండేది. కానీ స్కూల్‌కి వెళ్లేటప్పుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకునేది.ఉదయాన్నే అమ్మ బాగా నిద్ర లేపుతుంది. “వైష్ణవి లేచి రెడీ అవ్వమ్మా, స్కూల్‌కి వెళ్ళాలి”…

అనగనగా ఒక చిన్న ఊరిలో వైష్ణవి దేవి అనే అమ్మాయి ఉండేది. ఆమెకు చదువులో మంచి ఆసక్తి ఉండేది. కానీ స్కూల్‌కి వెళ్లేటప్పుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకునేది.
ఉదయాన్నే అమ్మ బాగా నిద్ర లేపుతుంది. “వైష్ణవి లేచి రెడీ అవ్వమ్మా, స్కూల్‌కి వెళ్ళాలి” అని చెప్పగానే అమ్మాయి కళ్లలో నీళ్లు తిరుగుతాయి.

“అమ్మా… నాకు స్కూల్‌కి వెళ్లాలి అనిపించడం లేదు” అని ఏడుస్తుంది. కానీ అమ్మ ముద్దు పెట్టి “అక్కడ చాలా ఫ్రెండ్స్ ఉంటారు, టీచర్ నీకు కొత్త కొత్త కథలు చెబుతుంది, నీకు మంచి ఆట వస్తువులు కూడా ఉంటాయి” అని చెప్పేది.

వైష్ణవి కాస్త నమ్మకంగా లేచి స్కూల్ యూనిఫాం వేసుకుంటుంది. కానీ స్కూల్ గేటు దగ్గరకి వచ్చేసరికి మళ్లీ కన్నీళ్లు వస్తాయి.

టీచర్ దగ్గరకి వెళ్ళగానే టీచర్ ఆమెను ముద్దాడి, “ఏందమ్మా వైష్ణవి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ నీకు చాలా స్నేహితులు దొరుకుతారు. అందరం కలసి ఆటలు ఆడుకుందాం, పాటలు పాడుకుందాం” అని స్నేహంగా మాట్లాడుతుంది.

కొంతసేపటికి వైష్ణవి కొత్త స్నేహితురాలు సీతను కలుస్తుంది. ఇద్దరూ బంతి ఆడటం మొదలెడతారు. ఆడుకుంటూ ఆడుకుంటూ వైష్ణవి కన్నీళ్లు మరిచిపోతుంది.

అప్పటి నుండి వైష్ణవి స్కూల్‌కి వెళ్లడమే కాకుండా, ప్రతిరోజూ ఆనందంగా స్నేహితులతో గడపసాగింది

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *