తిండిపోతు దయ్యాలు

అనగనగా ఒక ఊరిలో ఆ ఊరి పేరు రామాపురం. ఆ ఊరిలో ముగ్గురు తిండిపోతు దయ్యాలు ఉండేవి.వాటి పేర్లు మొదటి దయ్యం లంబు, చింబు డింబు, టింబు, ఈ దయ్యాలు ఎప్పుడూ ఎవరింట్లో భోజనం వాసన వస్తే ఆ ఇంటికి వెళ్లేవారు…

అనగనగా ఒక ఊరిలో ఆ ఊరి పేరు రామాపురం. ఆ ఊరిలో ముగ్గురు తిండిపోతు దయ్యాలు ఉండేవి.వాటి పేర్లు మొదటి దయ్యం లంబు, చింబు డింబు, టింబు, ఈ దయ్యాలు ఎప్పుడూ ఎవరింట్లో భోజనం వాసన వస్తే ఆ ఇంటికి వెళ్లేవారు .అలా ఒక రోజు వాళ్ల ఊరిలో ఒక పెళ్లి జరిగింది వీరికి భోజనం వాసన వచ్చింది. ఆ వసాన్ని చిన్న దయ్యం డింబు పసిగట్టింది ఇక వాళ్లు ముగ్గురు కలిసి ఆ పెళ్లి దగ్గరకు వెళ్లారు. అప్పుడు అక్కడ వాళ్లు భోజనం చేయడం ప్రారంభించారు. అది చూసిన ఒక వ్యక్తి ఆ పెళ్లి పెద్ద కు చెప్పారు .ఆ పెళ్లి పెద్ద తనకు తెలిసిన మాంత్రికుని పిలిపించి వాటిని బంధించమన్నాడు. అది గమనించిన రెండు చిన్న దయ్యాలు అక్కడినుండి కాస్త దూరంగా వెళ్లి గమనిస్తున్నాయి. ఆ తరువాత దయ్యాన్ని మాంత్రికునికి అప్పగించారు పెద్ద దయ్యాన్ని మాంత్రికుడు దేహశుద్ధి చేసి సీసాలో బంధించి నదిలో వేస్తాడు. అది గమనించిన చిన్న దయ్యాలు ఆ మాంత్రికునికి కనబడకుండా బంధించిన సీసాను వెతుక్కుంటూ వెళ్లిపోయాయి. ఆ తర్వాత పెళ్లి పెద్దలు సంతోషంగా పెళ్లి పనిలో మునిగిపోయారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *