
ఒక అందమైన కుటుంబం నా పేరు మీనాక్షి మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా కుటుంబంలో నేను తమ్ముడు అమ్మానాన్నలు ఆనందంగా జీవించే వాళ్ళం మా ఊరిలో మా కుటుంబం చెప్పుకోదగదే ఆర్థికంగా కొంచెం ఉన్నవాళ్లమే అమ్మ నాన్నలు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు చదువుతోపాటు ఆటలలో మొదటి ప్రైజ్ వచ్చేది మా ఊరిలో ఇంటర్ వరకే ఉంది పై చదువుల కోసం హైదరాబాదుకు వెళ్లాలి నాకేమో చదువుకోవాలని ఉంది మా ఇంట్లో వాళ్లకు కూడా చదివించాలని ఉంది కానీ ఇంటి పక్కల వారు చుట్టాలు ఆడపిల్లని ఏమి చదివిస్తావులే అన్నారు ఈ రోజుల్లో మంచి రోజులు లేవు ఇంటి పని లేకుంటే కుట్టుమిషన్ నేర్పించు అన్నారు అందుకు అమ్మానాన్నలకు ఏమి చేయాలో అర్థం కాలేదు అమ్మాయికి ఏమో చదువుకోవాలని ఉంది.
మీనాక్షి నాకేమో చాలా భయం ఉంది మా అమ్మ నాన్నలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఒక రెండు రోజుల తర్వాత మా నాన్న పిలిచి అడిగాడు నీవు ఏమి చేయాలని అనుకుంటున్నావు అప్పుడు నా సమాధానం నాన్న నేను చదువుకోవాలని ఉంది నాన్న చదివించండి అని చెప్పాను అప్పుడు అమ్మా నాన్న పక్కింటి వారు అలా అన్నారు చుట్టాలు ఇలా అన్నారు అని నిన్ను చదువు మాన్పించను అని అన్నాడు ఎవరు ఏమనుకున్నా నిన్ను చదివిస్తాను అని అన్నా నాన్నలు చెప్పడంతో చాలా ఆనందంతో ఉన్నాను రెండు రోజుల తర్వాత నేను అమ్మ నాన్నలు వచ్చి ఒక మంచి కాలేజీలో చేర్పించారు ఇంజనీరింగ్ కావాలని నా కోరిక ఆ కోర్సు కు సంబంధించిన గ్రూపులో జైను అయ్యాను నేను హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్లే దాన్ని రోజు మంచిగా చదువుకునే దాన్ని కొన్ని రోజుల అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి ఎగ్జామ్స్ రాశాను మంచి మార్కులు వచ్చాయి ఇంజనీరింగ్ పూర్తి అవ్వడంతో తరువాత ఇంటికి తిరిగి వచ్చాను కొన్ని నెలల తర్వాత మా నాన్న పెళ్లి సంబంధం చూడడం మొదలుపెట్టాడు కొన్ని రోజుల తర్వాత మాకు తెలిసినవారు ఒక మంచి సంబంధం తీసుకువచ్చారు అతడు ఒక మంచి కంపెనీలో సాఫ్టువేర్ ఉద్యోగం చేస్తున్నాడు మంచి జీవితం మంచి కుటుంబం అని చెప్పారు మా నాన్న అబ్బాయి వాళ్ల ఇంటికి వెళ్లి అన్ని విషయాలు తెలుసుకున్నాడు అప్పుడు మా నాన్న వచ్చి నన్ను పిలిచాడు మీనాక్షి నీకు ఇష్టమేనా అని అడిగాడు అప్పుడు నా సమాధానం నాకు ఇష్టమే అని చెప్పాను కొద్దిరోజుల తర్వాత మా వాళ్ళు మంచిగానే కట్నాలు కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు.
కొద్దిరోజుల తర్వాత మా అత్తగారి ఇంటి నుంచి హైదరాబాదుకు వచ్చాము ఇక్కడ మంచి ఇల్లు తీసుకుని ఉన్నాము మా వారు నన్ను ప్రేమగా ఆనందంగా చూసుకునేవారూ మా జీవితం అలా సాగిపోతుంది నేను ఇంట్లోనే ఉండేదాన్ని మా వారు ఆఫీసుకు వెళ్లే వారు అలా కొన్ని రోజుల తర్వాత మా వారికి చెప్పాను నాకు ఇంట్లో ఉండడం నాకు బోర్ గా ఉంది నేను కూడా ఏదైనా జాబ్ చేస్తాను అని చెప్పాను దానికి మా వారు ఒప్పుకోలేదు నీవు జాబు చేయవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు దానికి నేను నాకు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేదు అండి అని చెప్పాను మా వారిని ఎలాగో ఒకలాగా ఒప్పించాను కొద్దిరోజుల తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది మంచి జీవితం అలా జీవితం సాగిపోతుండగా మా ఆఫీసులో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
“నీ జీవితం మారబోతుంది అని జాగ్రత్త సుమా అంటూ కాలం చేసిన హెచ్చరిక” అది ఆ చిన్న పరిచయం కాస్త శారీరక సంబంధం అవుతుంది ఆ వ్యామోహంలో పడిపోయి భర్తను నిర్లక్ష్యంగా చేస్తుంది అలంకరణ మీద మితిమీరిన వ్యామోహం పెంచుకుంటుంది ఆమె కదలికలలో భర్తకు అనుమానం కలిగిస్తాయి భర్త ఒకరోజు ఆఫీస్కు వెళ్తున్నట్టు వెళ్లి కొంత సమయం తర్వాత ఇంటికి వస్తాడు ఆ సమయంలో భార్య మరొక వ్యక్తితో కనిపించింది అది చూసి భర్త కలలో కన్నీళ్లు ఆగలేవు భర్త ఏడుస్తూ “నేను నీకు ఏమి పాపం చేశాను నన్ను ఇలా మోసం చేశావు అంటూ భర్త” చనికావేషంలో భార్యను ప్రియుడుని చంపేస్తాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతని పట్టుకుపోతారు నిన్నటిదాకా ప్రశాంతంగా సాగిన జీవితం అనూహ్యమైన మలుపు తిరగడంతో జీవితం ఏ నిమిషంలో ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు క్షణికావేషాలు తాత్కాలిక సంబంధాలు ఆకర్షణలు చాలా సందర్భాల్లో అనైతిక బంధాలకు కారణం అవుతాయి ఒక్కసారి చిక్కుకుపోతే బయటికి రావడం చాలా కష్టం అందుకోసమే కట్టుకునవాడిని మోసం చేయకండి మరియు మీ అమ్మానాన్నల పెంపకం పై మోసం చేయకండి మరొక జీవితం నాశనం చేయవద్దు ఇదే నా యొక్క మనవి “ఇట్లు నమస్తే జిందగీ”
Leave a Reply